Site icon NTV Telugu

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ రిలీజ్‌పై భారీ ట్విస్ట్!

Usthadh Bagathsing

Usthadh Bagathsing

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఒక చర్చ నడుస్తోంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఏప్రిల్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సడన్‌గా ఇండస్ట్రీ వర్గాల నుంచి మార్చి నెల డేట్స్ గట్టిగా వినిపించడం మొదలు పెట్టాయి. మార్చి 19 లేదా 26 తేదీల్లో ఉస్తాద్ బాక్సాఫీస్ వద్దకు వస్తాడని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ రూమర్స్ నిజమైతే, సినిమా విడుదల తేదీ పై ఉన్న గందరగోళం మరింత పెరిగినట్టే.

Also Read : Akhanda-2 : ‘అఖండ 2’ తాండవం మొదలైంది.. గంటలోనే 18.5K టికెట్లు బుక్!

ఎందుకంటే మార్చి డేట్స్‌లో సినిమా రిలీజ్ అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ తప్పదు. మార్చి 19న విడుదల చేస్తే, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘టాక్సిక్’ మూవీతో పోటీ పడాల్సి వస్తుంది. ఒకవేళ మార్చి 26కి ప్లాన్ చేస్తే, ఆ సమయానికి ‘ది ప్యారడైజ్’, ‘పెద్ది’ వంటి సినిమాలు ఇప్పటికే బరిలో ఉంటాయి. ఈ సినిమాలు ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఉస్తాద్‌కు పోటీనిస్తాయి. ఏదేమైనా, మేకర్స్ మొదట చెప్పిన ఏప్రిల్ కాకుండా సడన్‌గా మార్చి డేట్స్‌పై చర్చ జరగడం అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఫైనల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ఏ తేదీని లాక్ చేస్తుందో, ఎవరితో క్లాష్‌కు సిద్ధమవుతుందో చూడాలి.

Exit mobile version