OTT Updates: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో విజయవంతమైన ప్యార్ ప్రేమ కాదల్ సినిమ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Read Also: Matti Kusthi Review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ
తాజాగా ఈ మూవీ ఓటీటీలో రాబోతోంది. డిసెంబర్ 9 నుంచి ఆహా ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రేమ, పెళ్లి పట్ల నమ్మకం కలిగిన యువకుడిగా అల్లు శిరీష్ నటించాడు. పెళ్లి తన లక్ష్యానికి అడ్డుగా భావిస్తూ లివింగ్ రిలేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే యువతిగా అను ఇమ్మాన్యుయేల్ కనిపించింది. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్‌ను యూత్ ఎంజాయ్ చేసింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
