Urvashi Rautela: ఊర్వశిని వదిలేట్టు లేరు.. ఐదో ఐటెం సాంగ్ కూడా రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela signed her fifth Telugu item song: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటన కంటే ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం ఉన్నా ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైన ఊర్వశి రౌతేలా చిరంజీవి పక్కన అదిరిపోయే స్టెప్స్ వేసి అందరికీ దగ్గరయింది. ఊహించినట్టుగానే ఊర్వశి వరుస టాలీవుడ్ అవకాశాలతో దుసుకుపోతుంది అయితే ఆమె బిజీ అవుతోంది హీరోయిన్ గా కాదు కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే. నిజానికి ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయడం ఆమె పర్సనల్ గా ఇష్టపడుతోంది అని తెలుస్తోంది.
Nandamuri Mokshagna: శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు.. మతలబు క్యా హై ..?
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
ఎందుకంటే హీరోయిన్స్ కు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా ఒక ఐటెం భామలకు ఇచ్చే పారితోషికం అధికంగా ఉంటుందని అంటున్నారు. ఆమెకు బాలీవుడ్లో కంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ఆమె ఇటీవల రామ్ పోతినేని “స్కంద” లో “కల్ట్ మామా” ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయినా ఊర్వశి రౌతేలా కొత్త ఆఫర్లను అందుకుంటుంది. త్వరలో ఓ బడా తెలుగు సినిమా కోసం ఐటెం సాంగ్ చేయడానికి ఊర్వశిని సంప్రదించినట్లు సమాచారం. ఆమె పేరును త్వరలోనే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు ఆమె తెలుగు సినిమాలైన “వాల్టెయిర్ వీరయ్య,” “ఏజెంట్,” “బ్రో”, స్కంద వంటి నాలుగు ఐటెం సాంగ్స్ చేసింది. ఆమె ఐదవ ఐటమ్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!