Upendra Gadi Adda hero Exclusive web Interview: కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటున్నాడు “ఉపేంద్ర గాడి అడ్డా” హీరో కంచర్ల ఉపేంద్ర. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర విలేకరులతో మాట్లాడాడు. కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం అని తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటానని అన్నారు. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఓ రోజు వైజాగ్ కళాకారుల పిక్నిక్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళానని అక్కడ నన్ను చూసి ఓ దర్శకుడు కథ చెప్పగా అది నచ్చి సినిమాలోకి రావడం జరిగిందన్నారు.
Salaar: సలార్ కథ లీక్ చేసేసిన ప్రశాంత్ నీల్..
ఉపేంద్ర అడ్డా యూత్ ఫుల్, మాస్, ఎంటర్ టైనర్ గా రూపొందించామని, సోషల్ మీడియాను యూజ్ చేసేవారు కూడా ఈ సినిమా గురించి తెలుసుకుంటారన్నారు. ఈ సినిమాలో నా పేరు ఉపేంద్ర. నేను పుట్టిన అడ్డాలో కథ మొదలవుతుంది, అందుకే టైటిల్ పెట్టాం, కథ పరంగా డిమాండ్ కూడా చేసింది, నా చుట్టూనే కథ తిరుగుతుందని అన్నారు. ఫోన్ వుంటే, దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎటువంటి మంచి చెడులు అనేవి చూపామని హిళలు ఏ విధంగా వీటిని యూజ్ చేస్తున్నారనేది చూపామని అన్నారు. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటన కొద్దిగా నేర్చుకున్నా, ఆ తర్వాత నా కొచ్చిన కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగానన్న ఆయన మా నాన్న 11 సినిమాలు చేయాలని నియమం పెట్టుకున్నారని అందులో నాతో 5 సినిమా చేస్తారని అన్నాడు. సంక్రాంతికి నా తదుపరి సినిమాలు రిలీజ్ అవుతాయని ఉపేంద్ర అన్నారు.