టాలీవుడ్‌లో రామ్‌చరణ్–ఉపాసన దంపతులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. మొదట్లో ఉపాసన పై విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వీరిద్దరూ మెగా అభిమానులకు శుభవార్త అందించారు. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లిగా మారారు. వీరికి పాప పుట్టగా, ఆ చిన్నారికి క్లిన్ క్లారా అని పేరు పెట్టారు. క్లిన్ క్లారా పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్ని తాకింది. అయితే ఇప్పటి వరకు ఆ చిన్నారిని ప్రపంచానికి చూపించలేదు. అందుకే అభిమానులు కూడా ఆమెను చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. రెండో సంతానం పై స్పందించారు..
Also Read : Mirai : ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..
“మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం చేశాం. నేను పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఆ సమయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పు చేయదలచుకోవడం లేదు. సెకండ్ చైల్డ్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది. అంతే కాదు రామ్‌చరణ్–ఉపాసన దంపతులు కుటుంబ విషయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ముందుకు సాగుతున్నారు. నిర్మాతగా ఇప్పటికే విజయాలు అందుకున్న రామ్‌చరణ్, ఇప్పుడు థియేటర్ బిజినెస్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించే ప్రాజెక్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను ఉపాసన తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అపోలో గ్రూప్స్‌తో కలిసి పలు విజయవంతమైన వ్యాపారాలు నడిపిన అనుభవం ఉన్నందున, ఈ ప్రాజెక్టు కూడా ఆమె చేతుల్లో విజయవంతమవుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి మెగా అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.