Ram Charan: అల్లుడి పాటకు స్టెప్పులేసిన అత్త.. లవ్ యూ అన్న కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను అందుకునేలా చేస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గ్లోబల్ గ్లోబ్స్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. దీంతో చిన్నా లేదు.. పెద్దా లేదు.. ప్రతి ఒక్కరు ఈ సాంగ్ హుక్ స్టెప్స్ వేసి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ అత్త.. ఉపాసన తల్లి శోభనా కామినేని సైతం ఈ సాంగ్ కు స్టెప్స్ వేసి అలరించారు. అల్లుడి పాటకు స్టెప్ వేయడమే కాకుండా ఆయన నటించిన చిత్రానికి అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇక తన తల్లి.. తన భర్త సాంగ్ కు స్టెప్పులు వేయడంతో ఉపాసన మరింత సంబరపడింది. ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న తల్లికి లవ్ యూ చెప్పింది. అంతేకాకుండా అత్తగారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దాదాపు పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కానున్నారు. దీంతో మెగా వారసుడు కోసం మెగా ఫ్యామిలీనే కాదు మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
- Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
- Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
- Balakrishna: బాలయ్య ఆ దర్శకుడికి 'నో' చెప్పాడా?
Very proud mother in law – #NatuNatu in Davos ❤️🤩
Love mom @shobanakamineni https://t.co/yBc6CI4f79— Upasana Konidela (@upasanakonidela) January 18, 2023
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ బిగ్ వార్నింగ్.. కలెక్టర్లు, ఎస్పీల వరకు అందరికీ లీగల్ నోటీసులు!
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
-
Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
-
Nvidia Windfall: అదృష్టమంటే ట్రంప్‌దే.. ఆ సీఈఓ రీ-ఎంట్రీతో ఏకంగా 1.4 బిలియన్ల లాభం!
-
Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!