సెలబ్రిటీలు తమ బట్టలు, గడియారాలు, షూలు, హాలిడే ట్రిప్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రేక్షకులు సైతం ఏ సెలెబ్రిటీ ఏ బ్రాండ్ వాడుతున్నారు ? వాటి ఖర్చు ఎంత ? అనే విషయాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వాటిని ఉపయోగించే చాలా మందిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒకరు. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడినప్పటికీ ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2021 క్రిస్మస్ కోసం ఉపాసన డోల్స్ అండ్ గబ్బానా నుండి సెల్ఫ్-టై బోతో చారల సిల్క్ మిడి దుస్తులను ఎంచుకుంది. దాని ధర రూ. 2.5 లక్షలు అని తెలుస్తోంది. ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో ఫుల్ స్లీవ్ రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో వైట్ హీల్స్‌తో అందంగా కనిపిస్తోంది. మరోవైపు డెనిమ్ జీన్స్, కుర్తా షర్ట్‌లో రామ్ చరణ్ డాపర్‌గా కనిపిస్తున్నాడు.
క్రిస్మస్ పార్టీకి అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల, ఇతర మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. కాగా ఉపాసన ఒక వ్యవస్థాపకురాలు. మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో హీరోగా రూపొందిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది.