Upasana : మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. ఉపాసన సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తూ హెల్త్ పరంగా అందరికీ చాలా విషయాలు చెబుతోంది. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉన్న ఉపాసన.. ఇప్పుడు ఏకంగా కీలక బాధ్యతలు తీసుకుంటోంది. తెలంగాణను స్పోర్ట్స్ కేటగిరీలో టాప్ లో ఉంచేందుకు స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్రమంలోనే స్పోర్ట్స్ హబ్ ను స్థాపించింది. ఈ స్పోర్ట్స్ హబ్ కు సంజీవ్ గోయెంకాను నియమించింది ప్రభుత్వం.
Read Also : Coolie : తెలుగులో రాజమౌళి.. తమిళ్ లో లోకేష్.. రజినీ కామెంట్స్
వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు. తనకు కీలక బాధ్యతలు ఇచ్చినందుకు ఉపాసన ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పింది. ఈ పోస్ట్ తో తన బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపింది. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది ఉపాసన. త్వరలోనే ఆమె బాధ్యతల స్వీకరణ ఉండొచ్చు. ఉపాసన ఎప్పటికప్పుడు చేసే అవగాహన వీడియోలతో ఆమెకు పాపులారిటీ చాలా పెరిగింది. సోషల్ మీడియాలో ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
Read Also : Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
