Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14న వస్తున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇన్నేళ్లకు తీరింది. అతని సినిమాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటా. ప్రతి సినిమా నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. తెలుగులో రాజమౌళి ఎలానో.. తమిళ్ లో లోకేష్ అలా. అన్నీ హిట్ సినిమాలే. ప్రతి సినిమాకు తన స్పెషాలిటీ ఏంటో చూపిస్తుంటాడు. అతనితో పనిచేసినంత కాలం చాలా ఎంజాయ్ చేశా.
Read Also : Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
మూవీ షూట్ ఇంత త్వరగా అయిపోయినందుకు బాధగా అనిపించింది. కానీ సినిమాను మీ అందరూ ఆస్వాదిస్తారు. చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నాగార్జున విలన్ రోల్ చేశారు. ఆ పాత్ర గురించి విన్న తర్వాత నేనే చేయాలి అనిపించింది. ఆయన ఎప్పుడూ మంచిగా ఉండే పాత్రలే కాకుండా ఇలాంటివి కూడా చేయాలని అనుకున్నారేమో. అందుకే ఈ సినిమాకు లేటుగా ఒప్పుకున్నారు. ఆయనతో సినిమా చేసినన్ని రోజులు కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఏదో ఒక టిప్ చెబుతూ ఉంటారు. ఆయన కూల్ గా ఉంటారు. అందుకే అంత అందంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఆయన, నేను ఒకేసారి సినిమాలు చేయడం మొదలు పెట్టాం. కానీ ఆయనకు జుట్టు ఇంకా ఊడలేదు అంటూ ప్రశంసలు కురిపించారు రజినీకాంత్.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..