OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ పడుతుందని ఆయన గ్రహించారు. కానీ ఏం లాభం.. ఫ్యాన్స్ మాత్రం ఓజీ జపం చేస్తున్నారు.
Read Also : Kalyani Priyadarshan : అనాథఆశ్రమంలో పెరిగా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్
సోషల్ మీడియా గత నాలుగు రోజులుగా ఓజీ ఫీవర్ తో ఊగిపోతోంది. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో పవన్ కల్యాణ్ కాన్సర్ట్ షో పెడితే ఎగబడుతున్నారు. వేలాది మంది తరలి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్ స్పీచ్ ఇస్తే కథ వేరేలా ఉంటుంది. ఇక ఓజీ ఫీవర్ ఇప్పట్లో తగ్గించడం కష్టమే. అసలే ఓజీ ప్రీమియర్ షో టికెట్లు వేలం వేస్తే ఏకంగా లక్ష దాటిపోతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఓజీ ఫీవర్ ఉన్న తర్వాత సినిమా కొంచెం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదేమో.
Read Also : Robo Shankar : రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య