కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే అల్లరి నరేష్ ఇప్పుడు ట్రాక్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్నాడు. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఉగ్రం’ టీజర్ ని రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేశాడు. ఈ టీజర్ యాక్షన్ మోడ్ లో స్టార్ట్ అయ్యి, మరింత యాక్షన్ తో ఎండ్ అయ్యింది. నైట్ ఎఫెక్ట్ లో పోలిస్ గెటప్ లో అల్లరి నరేష్ మాస్ హీరో అనిపించే రేంజులో ఉన్నాడు. మీసాలు తిప్పి, మాస్ డైలాగులని కూడా చెప్పిన అల్లరి నరేష్, కంప్లీట్ మేకోవర్ లో కనిపించాడు. ‘భార్య, కూతరుతో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్న ఒక పోలిస్ ఆఫీసర్ ఫ్యామిలీని టచ్ చెయ్యడంతో తిక్కరేగిన ఒక పోలీసోడు’ ఎలా రివోల్ట్ అయ్యాడు అనేది ‘ఉగ్రం’ సినిమా కథ.
మాస్ ఎలిమెంట్స్ కి పూర్తిగా స్కోప్ ఉన్న ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మరో హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకంలో సినీ అభిమానులు ఉన్నారు. టీజర్ ఇచ్చిన యాక్షన్ మోడ్ నుంచి బయటకి వస్తు ఉగ్రం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం ఉగ్రం సినిమా ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది. టీజర్ కి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన శ్రీ చరణ్ పాకాల ఫస్ట్ సాంగ్ కి ఎలాంటి ట్యూన్ ఇచ్చాడు? సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే ఈవెనింగ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
The enchanting love of the fiercest man ❤️#Ugram first single announcement tod ay at 4.05 PM 💥#NareshVijay2@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @brahmakadali @jungleemusicSTH pic.twitter.com/u70u465ErB
— Shine Screens (@Shine_Screens) March 17, 2023