కొత్త హీరోల చిత్రమైన బాక్సాఫీస్ పోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు కొత్త కథానాయకులను తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. విశేషం ఏమంటే ఈ ఇద్దరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులైన వారి వారసులే. అందులో ఒకరు కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మరొకరు ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్. గల్లా అశోక్ గుంటూరు టీడీపీ ఎం.పి. గల్లా జయదేవ్, కృష్ణ కుమార్తె పద్మావతి కుమారుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా ‘హీరో’ పేరుతో సినిమాను నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 15న జనం ముందుకు వస్తోంది. అయితే… అశోక్ గల్లా సినిమా ప్రయాణం చాలా చిత్రంగా సాగింది. నిజానికి ‘దిల్’ రాజు అశోక్ ను హీరోగా మూడేళ్ళ క్రితమే పరిచయం చేయాలని అనుకున్నాడు. టర్కిష్ మూవీ ‘లవ్ లైక్స్ కోఇన్సిడెన్స్’ రీమేక్ హక్కులు కొని, రాజమౌళి శిష్యుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘అదే నువ్వు – అదే నేను’ పేరుతో 2018 దసరా రోజు పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాడు. కారణాలు ఏవైనా ఆ ప్రాజెక్ట్ ఆ తర్వాత ఆగిపోయింది. అందులో ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఒక కథానాయికగా నటించిన నభా నటేశ్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు జనం ముందుకు రాబోతున్న ‘హీరో’లో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించిన మరో భామ నిధి అగర్వాల్ హీరోయిన్!
ఇక ఆశిష్ రెడ్డి విషయానికి వస్తే… ‘దిల్’ రాజు తన సోదరుడు, సహ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ను హీరోగా చేయాలని రెండు మూడేళ్ళ క్రితమే అనుకున్నాడు. రకరకాల కాంబినేషన్స్ సెట్ చేసి, చివరకు ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష చేతిలో పెట్టాడు. గత యేడాదిగా ఈ సినిమాను టైమ్ చూసి విడుదల చేయాలని చూస్తున్న ‘దిల్’ రాజు చివరకు హఠాత్తుగా సంక్రాంతి బరిలో ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ను రిలీజ్ చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
చిత్రం ఏమంటే… ‘దిల్’ రాజు పరిచయం చేయాల్సిన అశోక్ గల్లా ఇప్పుడు దిల్ రాజు సోదరుడు ఆశిష్ తో సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాడు. ‘రౌడీ బాయ్స్’ 14న వస్తుంటే, ‘హీరో’ 15న వస్తోంది. ఈ రెండు సినిమాలూ ఈ యువ హీరోలకు సొంత చిత్రాలే. వాళ్ళ ఓన్ బ్యానర్ లో నిర్మితమైనవే. సో…. ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది? జనం ఎవరివైపు మొగ్గు చూపుతారు? అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!