Two Directors For Director Movie.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ‘నాటకం’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆశిష్ గాంధీ అలాంటి ఓ సస్పెన్స్ థిల్లర్ మూవీలో నటించాడు. అదే ‘డైరెక్టర్’. విశేషం ఏమంటే ఈ ‘డైరెక్టర్’ మూవీకి ఒకరు కాదు ఇద్దరు దర్శకులు. కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ సంయుక్తంగా దీనిని డైరెక్ట్ చేశారు. ఐశ్వర్యరాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటించిన ‘డైరెక్టర్’ మూవీని డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో ఆయన కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్’ చిత్రాలకు సంగీతం సమకూర్చిన సాయి కార్తీక్ ‘డైరెక్టర్’ మూవీకి స్వరాలు అందించాడు. ఈ నెల 18న ‘డైరెక్టర్’ మూవీ జనం ముందుకు రాబోతోంది.
ఈ వీకెండ్ లో ఆరు సినిమాలు!
గతవారం రెండు పాన్ ఇండియా చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. అందులో ఒకటి సూర్య ‘ఈటీ’ కాగా, మరొకటి ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’. ఇక ఈ నెల 25న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో ఈ వారంలో చిన్న సినిమాలు విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం కన్నడ డబ్బింగ్ చిత్రం ‘జేమ్స్’ విడుదల అవుతోంది. శుక్రవారం రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’, సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన ’69 సంస్కార్ కాలనీ’, ‘నల్లమల’, ‘సంహారి’, ‘డైరెక్టర్’ మూవీస్ జనం ముందుకు రాబోతున్నాయి. మరి ఈ ఆరు చిత్రాలలో ప్రేక్షకులు దేనివైపు మొగ్గు చూపుతారో చూడాలి.