Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా, కాజోల్. వీరిద్దరూ గతంలో బాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్లు. ప్రస్తుతం వీరిద్దరూ ‘టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్’ షోను రన్ చేస్తున్నారు. ఈ షోకు తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన కరణ్ జోహార్, జాన్వీకపూర్ గెస్ట్ లుగా వచ్చారు.
Read Also : Mohan Lal : మోహన్ లాల్ కు భారీ ఎదురుదెబ్బ..
ఇందులో ఈ నలుగురూ కలిసి శారీరక సంబంధాలు, ఎమోషనల్ బంధాల గురించి చర్చించారు. ఆ టైమ్ లో ట్వింకిల్, కాజోల్ మాట్లాడుతూ.. ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చాలా పెద్ద నేరం అన్నారు. తమ దృష్టిలో భార్య, భర్తలు శారీరకంగా వేరే వాళ్లతో సంబంధం పెట్టుకోవడం అసలు తప్పే కాదన్నట్టు చెప్పారు. దీనికి జాన్వీకపూర్ ఒప్పుకోలేదు. వేరే వాళ్లతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా తప్పే అని చెప్పింది. కానీ ట్వింకిల్, కాజోల్ కలిసి జాన్వీ మాటలను కొట్టిపారేశారు. ఇలా జరిగిన వీళ్ల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ట్వింకిల్, కాజోల్ ను ఏకిపారేస్తున్నారు. ఇలాంటి చెత్త ప్రోగ్రామ్ లు పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Read Also : Prabhas : మరో సీక్వెల్ లో ప్రభాస్..?
