Ranbir: ఇన్ని ముద్దులు ఉన్నాయి ఏంటి? సార్ ఈ ట్రైలర్ అలియాకి చూపించారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తూ జూతి మే మక్కార్’. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఏ ఫ్రేమ్ చూసినా గ్లామర్, ఫన్, లవ్, కామెడీ లాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్లే బాయ్ లాంటి అబ్బాయికి ఒక మోడరన్ అమ్మాయి తగిలితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తూ లవ్ రంజన్ ఈ మూవీకి తెరకెక్కించాడు. 2018లో రిలీజ్ అయిన ‘సోను కే టిటు కి స్వీటీ’ తర్వాత లవ్ రంజన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో సినీ అభిమానుల్లో ‘తూ జూతి మే మక్కార్’పై మంచి అంచనాలు ఉన్నాయి. లవ్ స్టోరీస్ తీయడంలో పెర్ఫెక్షనిస్ట్ అయిన లవ్ రంజన్, ఈ ‘తూ జూతి మే మక్కార్’ ట్రైలర్ లో కూడా లీడ్ పెయిర్ మధ్య సూపర్బ్ కెమిస్ట్రీని చూపించడు.
రణబీర్ లోని ఈజ్, శ్రద్ధ గ్లామర్ లు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ప్రీతం కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ లో రణబీర్, శ్రద్ధ కపూర్ ల మధ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు సార్లు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ చూసిన వాళ్లు షాక్ అయ్యి… “ఒక్క ట్రైలర్ లో ఇంత రోమాన్స్ ఉందేంటి? మూడు లిప్ లాక్స్ ఉన్నాయి, ఇంతకీ అసలు ఈ ట్రైలర్ ని అలియా భట్ కి చూపించారా?” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలియాతో పెళ్లి అయిన తర్వాత రణబీర్ నటిస్తున్న మొదటి సినిమా ఈ ‘తూ జూతి మే మక్కార్’. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రణబీర్ కపూర్ మార్చ్ 8న రిలీజ్ కానున్న ఈ మూవీతో మరో సూపర్ హిట్ కొడతాదేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..