కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పురస్కారం లభించిన విషయం తెలిసిందే. అయితే అవార్డు తర్వాత కంగనా చేసిన స్పీచ్ చాలా మందికి నచ్చలేదు. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు ఆ స్పీచ్ లో కంగనా జిహాదీలు, ఖలిస్తానీలు అనే పాదాలను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తికి పదే పదే పద్మశ్రీ అవార్డు ఎలా లభిస్తుందో… అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కంగనా తన కామెంట్స్ తో పద్మశ్రీ అవార్డు విలువను తగ్గించిందని మరో నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. కానీ కంగనా మాత్రం తన మాటలను సమర్థించుకుంటూనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముందుకు సాగుతోంది.