NTV Telugu Site icon

Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్‌బాస్.. సీజన్ సీజన్‌కు రూల్స్ మారతాయా?

Bigg Boss 6

Bigg Boss 6

Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ చేయలేదని.. మరి ఇప్పుడు ఎందుకు రాజ్‌ను బలిపశువును చేశారని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఆరో సీజన్‌లో ఫేక్ ఎలిమినేషన్‌లు ఎక్కువ అయ్యాయని.. అలా చూసుకుంటే ఇప్పుడు రాజ్‌ది కూడా ఫేక్ ఎలిమినేషన్ అని మండిపడుతున్నారు. గతంలో సూర్య, గీతూ, బాలాదిత్యలను అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఇంటికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని

బిగ్‌బాస్ 4 సీజన్ విషయానికి వస్తే అరినాయా, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నారని.. వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ అవినాష్ ఎలిమినేట్ కాగా అతడి దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో అతడు వాడుకున్నాడని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో అరియానా, అవినాష్ ఇద్దరూ సేవ్ అయ్యారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ఆరో సీజన్‌లోనూ ఇదే నిబంధన అమలు చేయాలని.. ఫైమా ఎలిమినేట్ కాగా ఆమె దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యిందని.. కానీ రాజ్‌ కూడా సేవ్ అయినట్లే కదా అని బిగ్‌బాస్‌ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అరియానా హౌస్‌లో కొనసాగితే.. ఇప్పుడు రాజ్ కూడా హౌస్‌లోనే ఉండాలి కదా అని నిలదీస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ అడ్డంగా దొరికేశాడని.. సీజన్.. సీజన్‌కు రూల్స్ ఎలా మారుస్తాడని పలువురు మండిపడుతున్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్ కోరిక తీరదు.. వికేంద్రీకరణే మా విధానం

Show comments