Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Work 4Days a Week : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి వారానికి నాలుగురోజలు పని చేస్తే చాలు. అవును మీరు చదువుతున్నది నిజమే.. కానీ మన దగ్గర కాదు.. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు బ్రిటన్ లోని కంపెనీలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగురోజులు పని చేస్తే చాలు.. మరి జీతంలో కోత వేస్తారేమోనన్న సందేహం వద్దు. నెలంతా వేతనం చెల్లిస్తారు. ఈ వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పనిచేస్తున్నారు. 4 డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 450 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి.
Read Also: FIFA World Cup: ఓ వైపు సంబరాలు.. మరోవైపు అల్లర్లు.. ఖతర్ మొత్తం ఖాకీల చేతుల్లోకి
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
వారంలో నాలుగే పనిదినాలు కల్పించడంతో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారని.. కంపెనీల ఉత్పాదకతకు అది దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేయడం వల్ల మంచి అవుట్‌పుట్‌ను సృష్టించవచ్చన్నారు. యూరప్‌లోని మిగతాదేశాలతో పోల్చితే బ్రిటన్‌లోనే పనిదినాలు ఎక్కువ. దాంతో, నాలుగు రోజుల పనిదినాలను ముందుగానే ప్రయోగాత్మకంగా బ్రిటన్‌లోని కొన్ని కంపెనీల్లో ప్రవేశపెట్టారు. ఆ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు బాగుండడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంతేకాదు కొత్తవాళ్లు ఆ కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపించారు. ఉన్న ఉద్యోగులు కంపెనీ వీడకుండా చేయడంలో నాలుగు రోజుల పనిదినాల ఫార్ములా బాగా పనిచేసింది. అందుకని తమ ఉద్యోగులకు కూడా ఆ సౌకర్యం కల్పించేందుకు బ్రిటన్‌లోని వంద కంపెనీలు ఆమోదం తెలిపాయి.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!