Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.. ఇంకోపక్క తెలుగులో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. ఖుషీ షూటింగ్ రేపో మాపో పూర్తికావొస్తుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనున్నది అని తెలుస్తోంది. ఇకపోతే ఈ షూటింగ్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చినా అమ్మడు వెకేషన్స్ కు, టూర్లకు చెక్కేస్తోంది. మొన్నటివరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. కానీ, ఈ మధ్యనే ఈ చిన్నది.. మునుపటిలో నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే సామ్ కు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో.. అంతేమంది ట్రోలర్స్ కూడా ఉన్నారు. సందు దొరికితే చాలు సామ్ ను ఏకిపారేస్తున్నారు. చై తో సామ్ విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఈ ట్రోల్స్ మొదలయ్యాయి. మొన్నటివరకు సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెపై ట్రోల్స్ వేయడం ఆపాలని అందరు చెప్పుకొచ్చారు.
Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
ఇక కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ట్రోలర్స్ కు సామ్ బిహేవియర్.. ఆజ్యం పోసింది. ఈ మధ్య సామ్.. పబ్ లు, పార్టీలు అంటూ నవ్వుతు తిరుగుతుంది. కానీ, యశోద, శాకుంతలం సమయంలో బాగా నీరసంగా ఉన్నట్లు.. ఏడుస్తూ మాట్లాడింది. అదంతా ఇప్పుడు ఏమయ్యింది అని ట్రోలర్స్ ప్రశిస్తున్నారు. ప్రమోషన్స్ సమయంలోనే సింపతీ కోసం ఏడుస్తున్నది..నాటకాలాడుతుంది అంటూ ఏకిపారేస్తున్నారూ. నిన్నటికి నిన్న సెర్బియాలోని ఒక పబ్ లో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ చిందులు వేసిన సంగతి తెల్సిందే. ఇలాంటి పార్టీలు అప్పుడు ఈ హెల్త్ బావుంటుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ ఇండియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడే కాదు.. మళ్లీ ఖుషీ ప్రమోషన్స్ లో కూడా సామ్ ఇదే డ్రామాను ప్లే చేయకుండా ఉంటే బావుండు అని ఇంకొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై సామ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.