Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో, ఆయనను చివరిసారిగా వెండితెరపై చూస్తున్నామనే భావన అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. సినిమా ముగిసిన తర్వాత పలువురు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో విజయ్‌కు అభిమానులు భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను చూసిన అభిమానులు సందడి చేయగా, త్రిష చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు. విజయ్‌తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం గురించి గతంలో ఎన్నోసార్లు చర్చ జరిగిన నేపథ్యంలో, ఆమె ‘జన నాయగన్’ను థియేటర్లో వీక్షించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. సినిమా చూసిన తర్వాత భావోద్వేగానికి గురై, చిరునవ్వుతో బయటికి వచ్చారు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ‘జన నాయగన్’ సినిమా ఇండియా వైడ్‌గా సుమారు 2,500 స్క్రీన్లలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తెల్లవారుజామునే ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభమవగా, తమిళనాడులో ఉదయం నుంచి సాధారణ షోలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, నారాయణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read
- Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
@trishtrashers arrives at Rohini to watch #JanaNayagan 🥰🥰 #ThalapathyVijay #JanaNayaganFromToday #trisha pic.twitter.com/reJgvcpocb
— Tharani K (@CinemaAngle) July 23, 2026
తాజావార్తలు
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!