సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి త్రిష, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేవలం తన పుట్టినరోజు వల్ల మాత్రమే కాదు, ఆమె రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న జోరుగా సాగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెట్టింట 2004 నాటి ఒక ఇంటర్వ్యూ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “వచ్చే పదేళ్లలో నేను ముఖ్యమంత్రి అవుతాను” అని సరదాగా అన్నారో లేక అదే ఆశయంతో అన్నారో కానీ, ఆ మాటలు ఇప్పుడు నిజమవ్వబోతున్నాయా? అన్న సందేహం నెటిజన్లలో కలుగుతోంది. సరిగ్గా తమిళనాడు రాజకీయాలు మారుతున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.
తమిళ చిత్ర పరిశ్రమలో ‘దళపతి’ విజయ్, త్రిషలది హిట్ కాంబినేషన్. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జోడీ కొనసాగబోతుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ 2026 ఎన్నికల బరిలో నిలిచి గెలుపు దిశగా పయనిస్తోంది. దానికి తోడు విజయ్ విడాకులు, త్రిష – విజయ్ కొత్త జీవితం మొదలు పెట్టనున్నారు అనే అనేక వార్తల నేపథ్యంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి: నేడు తన పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె నేరుగా చెన్నైకి ప్రయాణమయ్యారు. తిరుమల నుంచి వచ్చిన వెంటనే ఆమె విజయ్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం స్నేహపూర్వక భేటీయా లేక పార్టీలో కీలకం కానున్నట్టు ప్రకటిస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. విజయ్ పార్టీలో ఆమె చేరికపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలవ్వడం ఖాయం. ఒకప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు ఆమెను అసెంబ్లీ మెట్లు ఎక్కించేలా చేస్తోందో లేదో చూడాలి.
