Ponniyan Selvan: పురుషుల రాజ్యంలో ధీటైన యువరాణి త్రిష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విక్రమ్, కార్తీ, ఐశ్వర్య ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసి భారీ అంచనాలను పెంచేశారు మేకర్స్.. ఇక తాజాగా త్రిష ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం త్రిష యువరాణి కుందవయి గా కనిపించనుంది. అందరూ పురుషులు ఉన్న రాజ్యంలో ధీర వనితగా త్రిష పాత్ర ఉండనున్నదని చిత్ర బృందం తెలిపింది.
ఇక యువరాణి కుందవయి గా త్రిష ఎంతో అద్భుతంగా కనిపించింది. అందమే అసూయ పడేలా త్రిష లుక్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చిత్రంలో కార్తీ రాజ్యానికి పట్టపురాణగా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30 న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మణిరత్నం, బాహుబలి లాంటి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
In a world of men, a woman of courage. Presenting Princess Kundavai! #PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada! 🗡️@madrastalkies_ @LycaProductions #ManiRatnam @arrahman pic.twitter.com/5aft7w1lYm
— Trish (@trishtrashers) July 7, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!