Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, చెన్నై బ్యూటీ త్రిష మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ, త్రిష చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇటీవల దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రిగా భారీ బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే. అయితే, ఈ కార్యక్రమానికి త్రిష కూడా హాజరరు. తాజాగా, ఆ రోజు తాను ధరించిన డ్రెస్‌లోనే ఉన్న కొన్ని ఫోటోలను త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
కేవలం ఫోటోలు షేర్ చేయడమే కాకుండా, దానికి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్” (Love is always louder – ప్రేమదే ఎప్పుడూ పైచేయి)అంటూ త్రిష ఆ ఫోటోలకు ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేసింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే నెటిజన్లు, విజయ్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తో ప్రేమ, డేటింగ్ అంటూ వస్తున్న వార్తలకు పరోక్షంగా త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తోందా అని కొందరు అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం.. కేవలం ఆమెకు ఆ డ్రెస్, ఆ ఫోటోలు నచ్చి పోస్ట్ చేసి ఉంటుందని, దానికి వస్తున్న రూమర్లకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ, ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలకు ఈ పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చిందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘గిల్లీ’, ‘తిరుపాచ్చి’, ‘కురువి’, ఇటీవల వచ్చిన ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో జంటగా నటించి మెప్పించారు. వెండితెర మీద వీరి మ్యాజిక్ కి ఎంత క్రేజ్ ఉందో, ఆఫ్-స్క్రీన్ లోనూ వీరి బంధంపై జనాల్లో అంతే ఆసక్తి నెలకొంది.
Also Read
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
తాజావార్తలు
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?