Trisha Accepts Apologies of Mansoor Ali Khan: రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ సినిమా గురించి మాట్లాడుతూ త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి, త్రిషతో నేను చేసే సీన్స్ లో ఒక్కటి అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా ఎందుకంటే నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా, కానీ అలా జరగలేదు. కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదని కామెంట్స్ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో త్రిష ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చింది. అతనిలాంటి వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలినని, నా మిగిలిన కెరీర్ లో అతడు లేకుండా చూసుకుంటానని ఎందుకంటే మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుందని త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.
Meetha Raghunath: అబ్బాయిల గుండె పగిలే న్యూస్.. నేటితరం డ్రీం గర్ల్ కి పెళ్ళయిపోతోంది!
ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఆయనపై చర్యలు చేపట్టి ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేయగా మన్సూర్ మంగళవారం చెన్నైలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి నోటీసు కూడా ఇవ్వకుండా నాపై నిషేధం ఎలా విధిస్తుంది..? నేను ఏ తప్పూ మాట్లాడలేదని, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదే లేదన్నారు. ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పేదీ లేదుని, నడిగర్ సంఘానికే నేను నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నా, నాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈరోజు మాత్రం మన్సూర్ ఆలీ ఖాన్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశా, ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండా నేను గెలిచా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి, అందుకు క్షమాపణలు కోరుతున్నా ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం మీద త్రిష కూడా స్పందించారు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దైవత్వం అని ఆమె తాను క్షమిస్తున్నట్టు ఇన్ డైరెక్టుగా ట్వీట్ చేశారు.
To err is human,to forgive is divine🙏🏻
— Trish (@trishtrashers) November 24, 2023