“ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్‌ల ట్రైలర్‌లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం 11 గంటలకే రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహం, ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి. గ్రాండ్ గా ఉండి, గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ ట్రైలర్ విడుదలతోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ఏడాది టాలీవుడ్ లోని భారీ సినిమాల్లో లాంగెస్ట్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది.
Read Also : ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ తో దద్దరిల్లిన థియేటర్లు!
Also Read
టీమ్ “ఆర్ఆర్ఆర్” సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ 3:07 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటుందని వెల్లడించింది. సాధారణంగా చాలా భారతీయ సినిమా ట్రైలర్‌లు 3 నిమిషాల కంటే తక్కువ నిడివిని కలిగి ఉంటాయి. 187 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ఖచ్చితంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో వచ్చిన అత్యంత లాంగెస్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ ప్రేక్షకులకు “ఆర్ఆర్ఆర్” ప్రపంచంలో థ్రిల్ రైడ్ అందిస్తుంది.
బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!