తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎప్పటి నుంచో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా లిస్టులోకి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కూడా జాయిన్ అయ్యింది. KGF చాప్టర్ 1 అండ్ KGF చాప్టర్ 2, కాంతర సినిమాలు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయి. ఇప్పుడు కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ వంతు వచ్చింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలని చేస్తోంది. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్లు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపిస్తున్నారు. ఇప్పటి యంగ్ హీరోలు కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ రీజనల్ మార్కెట్ కి మాత్రమే పరిమితం అయ్యారు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ లాంటి వాళ్లు ఇతర ఇండస్ట్రీలకి వచ్చి పని చేస్తున్నారు కానీ మలయాళం నుంచి పాన్ ఇండియా సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. మోహన లాల్ మరక్కర్ సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం చేసాడు కానీ అది బెడిసికొట్టింది. ఇక ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేసులోకి తెస్తూ ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా బౌండరీలు దాటబోతుంది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘2018’.
కేరళలో 2018లో వచ్చిన భయంకరమైన వరదల నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రిలీజ్ అయినా రెండు వారాల్లోనే కేరళ బాక్సాఫీస్ దగ్గర 135 కోట్లు రాబట్టిన 2018 మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ స్టేటస్ అందుకుంటూ ఉంది. కంటిన్యూ చేస్తూ 2018 సినిమాని హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. కేరళలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రతి రాష్ట్రం కేరళకి అండగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ‘Save Kerala’, ‘Gods Own Country in Trouble’ లాంటి టాగ్స్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరూ కేరళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్లే. 2018 సినిమాలో అప్పుడు జరిగిన పరిస్థితులనే చూపించారు కాబట్టి ఇతర రాష్ట్రాల ఆడియన్స్ కూడా సినిమాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాంతర స్టైల్ లో 2018 కూడా వైల్డ్ ఫైర్ లా ఇతర రాష్ట్రాల బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందేమో చూడాలి.
#2018Movie Official Trailers! 🤗❤️
Hindi – https://t.co/1ZXQDMBxCf
Kannada – https://t.co/tuUyDJH6rN
Telugu – https://t.co/smGGRB7AmG
Tamil – https://t.co/n9AgHFUIay#May26 pic.twitter.com/0TroSrZ4WS
— Tovino Thomas (@ttovino) May 18, 2023