DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డిగ్గర్. ఆస్కార్ అవార్డు విన్నర్ అలెజాండ్రో జి ఇనారిటు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయింది. వీక్ స్టోరీ, స్లోగా సాగె కథనం, పూర్ డైరెక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమై, కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం $20 మిలియన్లు మాత్రమే రాబట్టింది. అందులో అతిపెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో కేవలం $8 మిలియన్లు వసూళ్లు కావడం గమనార్హం.
ఈ సినిమా నిర్మాణం కోసం అంచనా ప్రకారం $140 మిలియన్ల నుండి $180 మిలియన్ల వరకు ఖర్చు చేశారు. అలానే వరల్డ్ వైడ్ గా ప్రమోషన్స్,మార్కెటింగ్ కోసం మరో $100 మిలియన్లు ఖర్చు చేశారట మేకర్స్. ఇంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం డిగ్గర్ రూపంలో వార్నర్ బ్రోస్ సంస్థకు దాదాపు $150 మిలియన్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో నష్టాలు చవిచూడటంతో హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత భారీ పరాజయం పొందిన చిత్రాల జాబితాలో డిగ్గర్ చేరింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న టామ్ క్రూజ్‌కు వరుసగా ఇది మూడోసారి నిరాశాజనక ఫలితమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని రిజ్ అహ్మద్ పాత్ర కోసం ముందుగా మలయాళ సినిమా నటుడు ఫహద్ ఫాజిల్ ను సంప్రదించారు. కానీ అనుకోని కారణాల వలన ఫహద్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.
Also Read
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?