Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అదేమంటే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో, సాఫ్ట్ రోల్స్‌తో అలరించిన యంగ్ హీరోలందరూ ఇప్పుడు ఒక్కసారిగా ‘వైల్డ్’గా మారిపోతున్నారు. వెండితెరపై ఊరమాస్ గెటప్పులు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు, భారీ రక్తపాతం ఉంటేనే సక్సెస్ వస్తుందనే ‘మాస్ మంత్రాన్ని’ అందరూ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసి బ్లాక్‌బస్టర్ కొట్టిన నాని, ఇప్పుడు అదే దారిలో పయనిస్తున్నారు. ది ప్యారడైజ్లో నాని మునుపెన్నడూ చూడని రీతిలో ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. హిట్ 3లో నాని సృష్టించిన రక్తపాతం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. సాఫ్ట్ హీరో కాస్తా ఇప్పుడు ‘వైల్డ్’ హీరోగా రూపాంతరం చెందారు. లవ్ స్టోరీల కంటే యాక్షన్ వైపు మొగ్గు చూపుతున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలను నమ్ముకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిన కింగ్‌డమ్ విజయ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆయన చేసున్న రౌడీ జనార్ధన్ & రణబలి సినిమాల పేర్లు వింటేనే విజయ్ ఎంతటి మాస్ పవర్ చూపించబోతున్నారో అర్థమవుతోంది.
Also Read
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
- Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
Also Read :బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..
కేవలం నాని, విజయ్ మాత్రమే కాదు.. దాదాపు ప్రతి యంగ్ హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసమే తాపత్రయపడుతున్నారు. ‘లెనిన్’ పాత్రలో అఖిల్ అక్కినేని పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు. ఒక భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న సంబరాల యేటిగట్టు సినిమా మెగా హీరో సాయిదుర్గా తేజ్కి మాస్ ఆడియన్స్‌లో మరింత పట్టునివ్వనుందని టీం నమ్ముతోంది. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలు చేసిన నిఖిల్, ‘స్వయంభు’తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ మాస్ హీరోగా అవతారమెత్తుతున్నారు. శర్వానంద్ సైతం ‘భోగి’ చిత్రంతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీస్తున్నారు.
ఎందుకీ మార్పు?
ప్రస్తుతం ఆడియన్స్ పల్స్ మారింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంటే భారీ శబ్దాలు, అదిరిపోయే యాక్షన్, గూస్‌బంప్స్ వచ్చే ఎలివేషన్లే అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, అందుకే హీరోలు కూడా తమ సేఫ్ జోన్ వదిలి ‘వైల్డ్’గా మారేందుకు ఇష్టపడుతున్నారు. మరి ఈ ‘వైలెన్స్’ మన యంగ్ హీరోలకు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!