Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రతిభావంతులు మెగా ఫోన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తున్నారు, తమ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌ను కెరీర్ బిల్డింగ్‌లో మాత్రం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ డైరెక్టర్లు తమ అమూల్యమైన సమయాన్ని సినిమాల మధ్య గ్యాప్‌తో వృథా చేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సుజీత్:
2014లో ‘రన్ రాజా రన్’తో ఎంట్రీ ఇచ్చిన సుజీత్, ఆ తర్వాత ప్రభాస్‌తో ఏకంగా ‘సాహో’ లాంటి భారీ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, డెబ్యూ ఇచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా ఆయన ఖాతాలో ఉన్నవి కేవలం మూడే సినిమాలు. పవన్ కళ్యాణ్‌తో ‘OG’ చేసి హిట్ అందుకున్సంన ఆయన చేయబోయే OG సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవుతుండటం ఆయన కెరీర్ వేగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
Also Read
- Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ... కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
- Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్... ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' మూవీ స్టోరీ లీక్
- Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
బుచ్చిబాబు సానా:
‘ఉప్పెన’తో టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా, తన రెండో సినిమా కోసం ఏకంగా ఐదేళ్లు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ లేదా చరణ్‌తో సినిమా కోసం సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి రావడంతో, ఒక దర్శకుడిగా తన ప్రైమ్ టైమ్‌ను ఆయన సరిగ్గా వాడుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీకాంత్ ఓదెల:
తొలి సినిమా ‘దసరా’తో 100 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. 2023లో వచ్చిన ఆ సినిమా తర్వాత నానితోనే ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. కానీ, డెబ్యూ ఇచ్చి మూడేళ్లు గడిచినా కనీసం సెకండ్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం.
Also Read:The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా..!
రాహుల్ సాంకృత్యన్ & రవికిరణ్ కోలా:
2014లో కెరీర్ స్టార్ట్ చేసిన రాహుల్, ఇప్పటివరకు చేసినవి కేవలం రెండే సినిమాలు (టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్). 12 ఏళ్ల కెరీర్‌లో ఇన్ని తక్కువ సినిమాలు చేయడం ఆయన పొటెన్షియల్‌కు తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నా, గ్యాప్ మాత్రం భారీగానే ఉంది.
రవికిరణ్ కోలా: ‘రాజా వారు రాణి గారు’ లాంటి బ్యూటిఫుల్ మూవీతో 2019లో పరిచయమయ్యాడు. రచయితగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కు పని చేసినా, డైరెక్టర్‌గా మాత్రం గత 7 ఏళ్లలో ఆయన వేగం చాలా తక్కువగా ఉంది.
నిజానికి సినిమా మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్ కావొచ్చు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా యంగ్ డైరెక్టర్లు తమ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్ మీద కూర్చోవడం వల్ల మార్కెట్ ట్రెండ్స్ మారిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ యంగ్ గన్స్ ఇకనైనా గేర్ మార్చి వరుస సినిమాలతో అలరిస్తారో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్‌బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్‌లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్‌ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?