GV Prakash: జీవి ప్రకాష్ హీరోగా జో డైరెక్టర్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జీవీ ప్రకాష్ కుమార్ త్వరలో మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా ‘జో’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లార్క్ స్టూడియోస్ మరియు పారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ‘గరుడన్’, ‘మామన్నన్’ వంటి వరుస విజయాలతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన లార్క్ స్టూడియోస్ ఇప్పుడు తన మూడవ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కిస్తోంది. కథా బలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ సక్సెస్ గ్రాఫ్‌ను మెయింటైన్ చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ, హరిహరన్ రామ్ చెప్పిన విభిన్నమైన లైన్‌కు ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది.
Also Read:The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. హరిహరన్ రామ్ రాసుకున్న పాత్ర కోసం ఆయన శారీరక మార్పుల కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వయంగా సంగీతాన్ని అందిస్తున్నారు. నటన, సంగీతం రెండూ ఆయనే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘జో’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మరోసారి హరిహరన్ దర్శకత్వంలో ఆమె కనిపించనుండటం విశేషం. ‘కర్ణన్’, ‘వాళై’ వంటి చిత్రాలతో అద్భుతమైన విజువల్స్ అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టీం ఇప్పటికే లొకేషన్ సెర్చింగ్ పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?