Site icon NTV Telugu

Tollywood to Hollywood: గ్లోబల్ వార్ షురూ.. రేసులోకి ఎన్టీఆర్-చరణ్?

Ssmb 29, Spirit, Peddi, Aa22 X A6, Ntr Neel

Ssmb 29, Spirit, Peddi, Aa22 X A6, Ntr Neel

ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మధ్య గ్లోబల్ వార్ మొదలైంది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేసులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ దూసుకొచ్చారు. అసలు బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే, తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ది ఇంటర్నేషనల్ రేంజ్‌. మన స్టార్ హీరోలు ఏకంగా హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీనితంటికి రాజమౌళినే కారకుడు. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మహేష్‌ బాబు సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్-రాజమౌళి దారిలో మిగతా స్టార్ హీరోలు గ్లోబల్ ఆడియెన్స్‌ రీచ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.

Also Read: ఏది హిట్? ఏది ఫట్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌లో తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే ఇండియాతో పాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా లాంటి భాషల్లో కూడా రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమాను కూడా భారీ ఎత్తున రిలీజ్‌కు చేయబోతున్నారు. విజువల్ వండర్‌గా రానున్న ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలుపుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ గ్లోబల్ రేసులోకి ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా దూసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాతోనే గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్ అందుకున్నారు చరణ్, తారక్. దీంతో ఇప్పుడు అప్ కమింగ్ ఫిల్మ్స్‌ను గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాను..ఇంటర్నేషనల్‌ లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే.. రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమాను కూడా గ్లోబల్‌ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారట. మొత్తంగా.. ఇప్పుడు మన్ స్టార్ హీరోలంతా గ్లోబల్ స్టార్‌డమ్ కోసం గ్లోబల్ వార్‌కు సిద్ధమవుతున్నారు.

Exit mobile version