Tollywood to Hollywood: గ్లోబల్ వార్ షురూ.. రేసులోకి ఎన్టీఆర్-చరణ్?
- రాజమౌళి దారిలో పాన్ ఇండియా స్టార్స్
- టార్గెట్ ఇంటర్నేషనల్ మార్కెట్
- గ్లోబల్ రేసులో ఐదుగురు స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మధ్య గ్లోబల్ వార్ మొదలైంది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేసులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ దూసుకొచ్చారు. అసలు బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే, తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ది ఇంటర్నేషనల్ రేంజ్. మన స్టార్ హీరోలు ఏకంగా హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీనితంటికి రాజమౌళినే కారకుడు. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్-రాజమౌళి దారిలో మిగతా స్టార్ హీరోలు గ్లోబల్ ఆడియెన్స్ రీచ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.
Also Read: ఏది హిట్? ఏది ఫట్?
Also Read
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌లో తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే ఇండియాతో పాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా లాంటి భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమాను కూడా భారీ ఎత్తున రిలీజ్‌కు చేయబోతున్నారు. విజువల్ వండర్‌గా రానున్న ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలుపుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ గ్లోబల్ రేసులోకి ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా దూసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాతోనే గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్ అందుకున్నారు చరణ్, తారక్. దీంతో ఇప్పుడు అప్ కమింగ్ ఫిల్మ్స్‌ను గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాను..ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే.. రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమాను కూడా గ్లోబల్ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారట. మొత్తంగా.. ఇప్పుడు మన్ స్టార్ హీరోలంతా గ్లోబల్ స్టార్‌డమ్ కోసం గ్లోబల్ వార్‌కు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!