Site icon NTV Telugu

‘అఖండ’ విజయం.. స్టార్ హీరోల స్పందన ఇదే

akhanda

akhanda

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ టీమ్ కి అభినందనలు తెలిపారు. “అఖండ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.. నందమూరి బాలకృష్ణగారికి, అఖండ టీమ్ కి అభినందనలు” అని తెలిపారు.

ఇక నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేస్తూ ” బాలకృష్ణగారు గేట్లు ఓపెన్ చేశారు.. అఖండ టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్” అని తెలిపారు. వీరితో పాటు యంగ్ హీరోలు రామ్ పోతినేని, నిఖిల్ సిద్దార్థ, సందీప్ కిషన్, నటుడు బండ్ల గణేష్, దర్శకులు గోపీచంద్ మలినేని, నందిని రెడ్డి, మంచు విష్ణు, మంచు లక్ష్మి తదితరులు అఖండ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/ganeshbandla/status/1466301607893630976?s=20
Exit mobile version