ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 2023 లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాల లిస్ట్ ను అనౌన్స్ చేశారు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలల్లో చాలానే ఉన్నాయి.. ఈ ప్లాట్ ఫామ్ తన అకౌంట్ లోని సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది.. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లుజాబితాను విడదల చేసింది. అయితే ఈ జాబితాలో టాప్-10లో ఒక్క భారతీయ సినిమా కానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ మామ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ -400లో స్థానం దక్కించుకుంది.. అలా 336వ స్థానంలో నిలిచిన రానా నాయుడు.. ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటలు వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది.. ఆ తర్వాత ‘చోర్ నికల్కే భగా’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ‘ఇండియన్ మ్యాచ్ మేకింగ్’ రియాల్టీ షో ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఆర్‌ఆర్‌ఆర్, ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ రణబీర్ కపూర్ ‘తు ఝూటీ మే మక్కర్’, కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’ సినిమాలు కూడా మంచి ఆదరణ పొందాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది..
ఇదిలా ఉండగా ఇక్కడ జనాల ఆదరణ పొందిన షోల లిస్ట్ ను చూస్తే..
1. ‘ది నైట్ ఏజెంట్’ సీజన్ 1
2. ‘గిన్నీ మరియు జార్జియా’ సీజన్ 2
3. ‘ది గ్లోరీ’ సీజన్ 1
4. ‘బుధవారం’ సీజన్ 1
5. ‘క్వీన్ షార్లెట్: ది బ్రిడ్జర్టన్ స్టోరీ’
6. ‘యు’ సీజన్ 4
7. ‘లా రీనా డెన్ సుర్’ సీజన్ 3
8. ‘అవుటర్ బ్యాంక్స్’ సీజన్ 3
9. ‘గిన్నీ మరియు జార్జియా’ సీజన్ 1
10. ‘ఫ్యూబర్’ సీజన్ 1.. ఇవన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యి మంచి వ్యూస్ స్ ను అందుకున్నాయి..
No. 1 show on Netflix India for 2023, and the only Indian show to make it amongst the top 400 of Netflix internationally.
I have reasons to be proud. 🙂 https://t.co/K9lYjARaBa pic.twitter.com/b4eaBVvdyb
— Vaibhav Vishal (@ofnosurnamefame) December 13, 2023