హైదరాబాద్ వేదికగా సినీ గ్లామర్ , క్రికెట్ జోష్ కలగలిసిన ఒక సరికొత్త క్రీడా పండుగకు తెరలేచింది. EBG గ్రూప్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభోత్సవ వేడుక భాగ్యనగరంలోని HICC లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లీగ్‌ను అధికారికంగా ప్రారంభించడమే కాకుండా, దీనికి హానరరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ముందుండి నడిపిస్తున్నారు. ఈ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, , సురేశ్ రైనా ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఒకవైపు వెండితెర తారలు, మరోవైపు క్రికెట్ లెజెండ్స్ ఒకే వేదికపైకి రావడంతో ఈ కార్యక్రమం కంటికి ఇంపుగా, వినోదభరితంగా సాగింది.
టాలీవుడ్ ప్రో లీగ్ కేవలం ఒక క్రీడా పోటీ మాత్రమే కాదని, ఇది సినిమా , క్రీడల అద్భుత సంగమమని దిల్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన ప్రతి వృత్తికి ఇందులో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ‘అలై బలై’ అనే ఇన్‌క్లూజన్ కాన్సెప్ట్‌ను ఈ లీగ్‌లో భాగం చేశారు. ఆరు జట్లతో ఫ్రాంచైజీ పద్ధతిలో సాగే ఈ లీగ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఆటగాళ్లుగా మైదానంలోకి దిగనుండగా, ప్రముఖ నిర్మాతలు టీమ్ ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి రెండు సీజన్ల చొప్పున నిర్వహించనున్న ఈ లీగ్ ద్వారా అటు అభిమానులకు క్రికెట్‌తో పాటు ఇటు వినోద కార్యక్రమాలను కూడా చేరువ చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్యాన్ జోన్లు , డిజిటల్ కంటెంట్‌ను కూడా నిర్వాహకులు సిద్ధం చేశారు.
పరిశ్రమలో ఐక్యతను చాటడమే కాకుండా, ఈ లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని టాలీవుడ్ సంక్షేమానికి కేటాయించాలని నిర్ణయించడం విశేషం. సినీ కార్మికుల , కళాకారుల సంక్షేమం కోసం ఈ వేదికను వాడుకోవాలన్నది దిల్ రాజు ప్రధాన సంకల్పం. ప్రస్తుతం ప్రాంతీయ స్థాయిలో ప్రారంభమైన ఈ టాలీవుడ్ ప్రో లీగ్‌ను భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేలా తీర్చిదిద్దాలని EBG గ్రూప్ , నిర్వహణ బృందం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లీగ్ ప్రారంభంతో టాలీవుడ్ కుటుంబమంతా ఒక్కటైనట్లని, ఇది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక భావోద్వేగమని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Atal Modi Suparipalana Yatra: ఓటమిని అంగీకరించని వ్యక్తి వాజ్ పేయ్..