Music Director Raj: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్ల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. రాజ్- కోటి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణించడం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో మ్యూజికల్ హిట్స్ సాధించాయి. రాజ్ పూర్తి పూర్తిపేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడు.
కెరీర్ తొలినాళ్లలో కోటి.. చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పనిచేయగా అక్కడ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ కలిసి పనిచేయాలని అనుకున్నారు. ఎన్నో వేల హిట్ సాంగ్స్ ఇచ్చిన ఈ ద్వయం.. కొన్ని విబేధాల వలన విడిపోయారు. హీరోలు, డైరెక్టర్లు నాకు ఎక్కువ విలువ ఇవ్వడంతో కొంతమంది రాజ్ ను డైవర్ట్ చేయడంతో ఆయన వెళ్లిపోయారని కోటి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక కోటితో విడిపోయాక.. రాజ్.. సిసింద్రీ, రాముడొచ్చాడు, చిన్ని చిన్ని ఆశ సినిమాలకు సోలోగా మ్యూజిక్ ను అందించాడు. ఇక ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ విషయంతెలియడం తో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురువుతున్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు.