Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Movie Shooting Stopped Due To Federation Strike

Tollywood Strike: ముదిరిన వివాదం.. నిలిచిన షూటింగ్స్

Published Date :June 23, 2022 , 9:16 am
By NTV WebDesk
Tollywood Strike: ముదిరిన వివాదం.. నిలిచిన షూటింగ్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నుంచి సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం 28 సినిమాల చిత్రీకరణలు జరుగుతుండగా, ఈ సమ్మె కారణంగా వాటి షూటింగ్ ఆగింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఈరోజు నుంచి యధావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని కార్మికుల్ని కోరింది. లేకపోతే ఆరు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నిర్మాతలెవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని సూచించింది.

మరోవైపు.. ఫెడరేషన్ సభ్యులు కూడా వెనక్కు తగ్గట్లేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగ్‌లకు హాజరు కామంటూ తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కంటే.. 45 శాతం ఎక్కువ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే.. నష్టపోయేది నిర్మాతలేనని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. అందుకే, దీన్ని పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న తరుణంలో.. ఈ వివాదం నిర్మాతలకు మరో తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.

ఇదిలావుండగా.. తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిర్మాతల తీరుపై మండిపడ్డారు. ప్రతీ హీరోకి పారితోషికాలు లక్షల్లో, కోట్లలో పెరుగుతోందని.. టికెట్ రేట్లు పెంచుకొని నిర్మాతలూ బాగానే సంపాదించుకుంటున్నారని.. కానీ కార్మికుల వేతనాల్ని పెంచమంటే మాత్రం కరోనాని సాకుగా చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇచ్చే కొద్దోగొప్పో వేతనాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Movie Shootings
  • Producer Film Council
  • Telugu Film Chamber
  • Telugu Film Federation
  • Tollywood Strike

తాజావార్తలు

  • NTRNeel : పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై అఫీషియల్ ప్రకటన

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

  • Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

  • Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions