వస్తువు కైనా, సినిమాకైనా ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటె ప్రచారం లేకపోతే ప్రజలకు దాని గురించి తెలియడం కష్టం. అందుకనే ఈ మధ్య స్టార్ హీరోలు సినిమాకు ఎంత ఖర్చుపెడుతున్నారో అంతకుమించి ప్రచారాలకు ఖర్చుపెడుతున్నారు. రకరకాల ఐడియాస్ తో ప్రేక్షకుల వద్దకు తమ సినిమాను తీసుకెళ్తున్నారు. థియేటర్స్, ట్రైన్స్ అన్ని అర్హత ఉన్నవే.. ఇక ఇవి కాకుండా వెండి తేరా హీరోలు బుల్లితెరకు వెళ్లి మరీ తమ సినిమను ప్రమోట్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న పెళ్లి సందD టీమ్ సీరియల్స్ కనిపించి మెప్పించింది. నిన్నటికి నిన్న ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లో భాగంగా అనిల్ రావిపూడి కూడా బుల్లితెరపై కనిపించి జంగం చేశాడు. ఇక ఈ లిస్టులోకి చేరిపోయాడు యంగ్ హీరో నితిన్.
ప్రస్తుతం ఈ హీరో నటించిన మాచర్ల నియోజకవర్గం రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నితిన్ బుల్లితెరలో ప్రసారం అయ్యే కొన్ని సీరియల్స్ లో కనిపించనున్నాడట. అందులో ఒక సీన్ లో నటించి సినిమా ప్రమోషన్స్ చేయనున్నాడు. నితిన్ తో పాటు హీరోయిన్ కృతి కూడా ఈ సీన్స్ లో పాల్గొంటున్నదని టాక్. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 12 ఆగస్టు న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ప్రమోషన్స్ వర్క్ అవుట్ అయ్యి బుల్లితెర ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తే.. నితిన్ కు హిట్ గ్యారెంటీ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి నితిన్ ఈసారి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.