నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో పాటు చిత్రబృందానికి శుభాకంక్షాలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య సినిమా గతంలో ఉన్న బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ను మళ్ళీ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.
Rea Also : సెంటిమెంటును బ్రేక్ చేసిన బాలయ్య
