Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!

Box Office

Box Office

Box Office Clash: ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ఒకే రోజు నాలుగు విభిన్న జానర్లకు చెందిన సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. హారర్ కామెడీ నుంచి యాక్షన్ డ్రామా వరకు పలు రకాల స్టోరీలతో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అందరిలో ఎక్కువ అంచనాలు నెలకొన్న చిత్రంగా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) నిలిచింది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన స్పందనతో ఈ సినిమా ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.

ఇక ‘కేజేక్యూ’ (KJQ) యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండగా, బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలవాలని చిత్రబృందం ఆశిస్తోంది. మరోవైపు ‘అనకాపల్లి’ (Anakapalli) గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఎమోషనల్ కథతో పాటు మాస్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రంపై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాగే ‘డీసీ: ది బ్లడీ వాలెంటైన్’ (DC The Bloody Valentine) యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ నాలుగు చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులను ఏ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.