Site icon NTV Telugu

Bachelor Heros : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోలు

Heros

Heros

Bachelor Heros : అదేంటో గానీ.. కొందరు హీరోలు లైఫ్‌ లో నో మ్యారేజ్ అంటూ సింగిల్ గానే ఉండిపోతున్నారు. వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత ఫేమ్, ఆరోగ్యం, అందం.. అన్నీ ఉన్నా సరే నో మ్యారేజ్ అంటున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. ఇందులో చాలా మంది హీరోలే లిస్టులో ఉన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ కు 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూనే ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ అయినా.. అమ్మాయిల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్నా ఈ అందగాడు పెళ్లి చేసుకోవట్లేదు. అటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా సింగిల్ గానే ఉండిపోయాడు.

Read Also : Baahubali The Epic : కీలక సన్నివేశాలు లేపేసిన జక్కన్న.. ఇది నీకు న్యాయమా..

ప్రస్తుతం 57 ఏళ్లు వచ్చినా నో మ్యారేజ్ అంటున్నాడు. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వస్తున్నా.. ఈయన మాత్రం సైలెంట్ గా ఉంటాడు. చూస్తుంటే ఇక పెళ్లి చేసుకునేలా లేడు. కోలీవుడ్ హీరో శింబు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు వచ్చినా.. ఇతను మాత్రం ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. నవదీప్ కు 40 ఏళ్లు వస్తున్నా సింగిల్ గానే ఉంటానంటున్నాడు. సాయిదుర్గాతేజ్ కు 36 ఏళ్లు, రామ్ పోతినేనికి 37 ఏళ్లు, అడవిశేష్ 39 ఏళ్లు, విజయ్ దేవరకొండ 36 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయారు. వీరిలో కొందరు పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడో వెయిట్ చేయాలి.

Read Also : Sonu Sood : లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన సోనూసూద్.. ఎన్ని కోట్లంటే..

Exit mobile version