Tollywood: బిగ్గెస్ట్ ఫైట్ కి రెడీ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమయ్యింది. టాలీవుడ్ హిస్టరీలోనే ముందెన్నడూ చూడనంత బిగ్గెస్ట్ ఫైట్ 2024 సంక్రాంతికి జరగనుంది. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’, మహేశ్ బాబు నటిస్తున్న ‘SSMB 28’ సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ తోనే ఆడియన్స్ ముందుకి రానున్నాయి. హ్యుజ్ బడ్జట్ తో, భారి స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై ఆకాశాన్ని తాకే రేంజులో అంచనాలు ఉన్నాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే సెన్సేషనల్ నంబర్స్ ని ప్రాజెక్ట్ K, SSMB 28 సినిమాలు రాబట్టగలవు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ లు కలిసి సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేస్తుంటే మహేశ్ బాబు, త్రివిక్రమ్ లు కలిసి కమర్షియల్ సినిమా చేస్తున్నారు. సింగల్ లాంగ్వేజ్ సినిమాలతోనే రీజనల్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ నంబర్స్ ని రాబట్టడం మహేశ్ బాబు సొంతం. ఏ స్టార్ కూడా మహేశ్ బాబుకి ఉన్నంత స్ట్రాంగ్ రీజనల్ రికార్డ్స్ లేవు. నాన్-బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసిన మొదటి హీరో మహేశ్ బాబునే. ఇక ప్రభాస్ విషయానికి వస్తే గత పదేళ్లలో తెలుగు హీరోలకే కాదు ఏ ఇండియన్ హీరోకి లేనంత రీచ్ అండ్ బాక్సాఫీస్ హిస్టరీ ప్రభాస్ సొంతం. పాన్ ఇండియా మార్కెట్ లో ఫ్లాప్ అయిన సాహో లాంటి సినిమాతో కూడా 350 కోట్లు కలెక్ట్ చెయ్యడం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది క్లాష్ ఆఫ్ టైటాన్స్, ఎల్ క్లాసికో లాంటి ఫైట్. ఇంతటి స్టార్ ఇమేజ్ అండ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న ప్రభాస్, మహేశ్ బాబులు 2024 సంక్రాంతికి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఎవరు ఎంత పెద్ద హిట్ కొడతారు అనేది రాబోయే రోజుల్లో ఇంటరెస్టింగ్ ఫైట్ గా ఉండబోతుంది.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
తాజావార్తలు
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!