2026 టాలీవుడ్‌కి ఆశించినంతగా కలిసి రావట్లేదా? సంక్రాంతి సీజన్‌తో మొదలైన ఆశలు, సమ్మర్ ముగిసేలోపే ఎందుకు ఆవిరైపోయాయి? చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల వరకు ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి? గోల్డెన్ సీజన్‌గా భావించే సమ్మర్‌లో కూడా థియేటర్స్ ఖాళీగా కనిపించడానికి అసలు కారణాలు ఏంటి? ఈ ఐదు నెలల్లో ఏ ఏ సినిమాలు నిరాశ పరిచాయి? అసలు మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి? ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలైనా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపిరి పోస్తాయా లేదో చూద్దాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌తో టాలీవుడ్‌కి మంచి స్టార్ట్ అయితే దొరికింది. స్టార్ హీరోల భారీ సినిమాలు, చిన్న హీరోల కామెడీ ఎంటర్టైనర్స్ కలిసి థియేటర్స్‌లో సందడి చేశాయి. కానీ, కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య బోల్తా కొట్టగా.. మరికొన్ని సైలెంట్ గా బాక్స్ ఆఫీస్ విన్నర్స్‌గా నిలిచాయి. అయితే 2026ను ఓపెన్ చేసింది ‘సైక్ సిద్ధార్థ్’. శ్రీనందు హీరోగా నటించిన ఈ కామెడీ రొమాంటిక్ డ్రామా జనవరి 1న విడుదలైంది. కానీ కథ కొత్తగా అనిపించకపోవడంతో సినిమా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ది రాజా సాబ్’ మాత్రం సంక్రాంతి సీజన్‌లో పెద్ద షాక్‌గా మారింది. ప్రభాస్ మార్కెట్ వల్ల ఓపెనింగ్స్ బాగున్నా.. కథ, విఎఫ్ఎక్స్ (VFX), స్క్రీన్ ప్లే పై నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. హారర్ కామెడీ జానర్‌లో కొత్తదనం లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయింది. ప్రభాస్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, బోమన్ ఇరానీ, సముద్రఖని లాంటి స్టార్ పవర్ మాత్రమే సరిపోదు, కంటెంట్ కూడా బలంగా ఉండాలనే చర్చ ఈ సినిమాతో మరింత పెరిగింది.
సంక్రాంతి సీజన్‌లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సినిమాలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’** కూడా ఒకటి. రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీ వర్కవుట్ అయినా కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అయింది. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా స్క్రీన్ ప్లే లాగ్ అయింది, ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది. దీంతో మాస్ మహారాజ ఈసారి సంక్రాంతి రేస్‌లో ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాడు. ఈ ఇయర్ సంక్రాంతి బిగ్గెస్ట్ విన్నర్‌గా నిలిచింది మన శివ శంకర వరప్రసాద్ గారు నటించిన చిత్రం. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్, ఫ్యామిలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కథపై మిక్స్డ్ రివ్యూలు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా ఆదరించారు. చిరంజీవి కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లతో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్ టైం టాలీవుడ్ రీజనల్ హిట్ రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.
సంక్రాంతి సీజన్‌లో ‘అనగనగా ఒక రాజు’గా వచ్చిన నవీన్ పొలిశెట్టి, మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎంటర్టైనింగ్ డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టుగా వచ్చిన లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా నవీన్ ఎనర్జీ సినిమాను చివరి వరకు నిలబెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నవీన్ పొలిశెట్టిని 100 క్రోర్స్ క్లబ్‌లో చేర్చింది ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి సీజన్‌లో మరో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది ‘నారీ నారీ నడుమ మురారి’. శర్వానంద్ నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ మంచి హాస్యం, రిలేటబుల్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా, మౌత్ టాక్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. సమ్మర్‌కు ముందు టాలీవుడ్‌కి ఈ సినిమా మంచి రిలీఫ్ ఇచ్చిందనే టాక్ వినిపించింది. అయితే, జనవరిలో చిన్న చితక సినిమాలు కేవలం టాలీవుడ్‌లోనే 30 దాకా రిలీజ్ అయ్యాయి. కానీ, ఏవి ఎప్పుడు వచ్చాయో తెలియకుండానే పోయాయి.
ఫిబ్రవరి, మార్చి:
ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ పరిస్థితి మరింత డల్ గా కనిపించింది. సుమారుగా 27 సినిమాలు విడుదలైనా, అందులో ఒక్క సినిమా కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ‘యూఫోరియా’ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చినా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కనెక్ట్ కాలేకపోయాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’కి పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్స్‌లో కలెక్షన్లుగా మారలేదు. అలాగే ‘సీతా పయనం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినా, స్లో నరేషన్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.
ఫిబ్రవరిలో కొంత బెటర్ అనిపించిన సినిమా ‘విష్ణు విన్యాసం’ మాత్రమే. శ్రీవిష్ణు మార్క్ కామెడీ వన్ లైనర్స్ ప్రేక్షకులను కొంతవరకు ఎంటర్టైన్ చేశాయి. కానీ, సెకండ్ హాఫ్ బలహీనంగా ఉండటం వల్ల సినిమా యావరేజ్ రిజల్ట్‌కే పరిమితమైంది. సుమారు 19 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్నప్పటికీ.. థియేట్రికల్‌గా మాత్రం భారీ రన్ సాధించలేకపోయింది. ఫిబ్రవరి మొత్తం చూసుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం తగ్గిపోయిందనే విషయం స్పష్టంగా కనిపించింది. ఓటిటి (OTT) అలవాటు, వీక్ ప్రమోషన్స్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం ఈ నెల బాక్స్ ఆఫీస్‌ను పూర్తిగా డల్ గా మార్చేసాయి.
మార్చి
మార్చి నెలలో కూడా టాలీవుడ్ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 27 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించిన సినిమాలు మాత్రం చాలా తక్కువే. ‘మృత్యుంజయ’తో శ్రీవిష్ణు క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త ప్రయత్నం చేశాడు. కానీ, డార్క్ టోన్, స్లో నరేషన్, లిమిటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కారణంగా సినిమా మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. అలాగే ‘సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూస’లో శివాజీ, లయ నటులకు ప్రశంసలు వచ్చినా.. వీక్ స్క్రీన్ ప్లే సినిమాను నిలబెట్టలేకపోయింది. మార్చి నెలలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ, పాత టెంప్లేట్ స్క్రీన్ ప్లే, ఎక్కువ రాజకీయ డైలాగ్స్, రొటీన్ సీన్స్ కారణంగా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఏప్రిల్, మే నెలల నిరాశ!
ఈ ఏడాది స్టార్టింగ్‌లో వచ్చిన బూమ్ చూసి ఈసారి సమ్మర్ సీజన్ కలిసి వస్తుంది అనుకున్నారు అందరూ. కానీ, ఏప్రిల్, మే నెలల్లో మాత్రం ఇండస్ట్రీకి మరింత షాక్ తగిలింది. కొత్త జానర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వచ్చినా ప్రేక్షకులు థియేటర్స్ వైపు ఎందుకు రాలేదు? సమ్మర్ లాంటి గోల్డెన్ సీజన్ ఈసారి కూడా ఎందుకు పూర్తిగా వేస్ట్ అయిపోయింది? ఏప్రిల్ నెలలో కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి పెద్దగా మారలేదు. మొత్తం 24 సినిమాలు విడుదలైనా చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచింది ‘బైకర్’, ‘రాకాస’, ‘డెకాయిట్’ మాత్రమే. ‘బైకర్’తో శర్వానంద్ మాత్రం కొంతవరకు రిలీఫ్ ఇచ్చాడు. మెట్రో రేసింగ్ బ్యాక్‌డ్రాప్, రేసింగ్ సన్నివేశాలు, శర్వానంద్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథలో ఎమోషన్స్ ఇంకాస్త బలంగా ఉండి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదనే టాక్ వినిపించింది. ఇక ‘రాకాస’ కామెడీ పరంగా ఎంటర్టైన్ చేసినా రొటీన్ స్టోరీ లైన్ కారణంగా యావరేజ్ రిజల్ట్‌కే పరిమితమైంది. ఊరించి ఊరించి వచ్చిన ‘డెకాయిట్’ కూడా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయలేకపోయింది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటనకు ప్రశంసలు వచ్చినా కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. అలాగే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో నాగశౌర్య మరో భారీ డిజాస్టర్‌ను చూశాడు. పాత కథ, వీక్ స్క్రీన్ ప్లే, ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సినిమా థియేటర్స్‌లో పూర్తిగా డౌన్ అయిపోయింది. మే నెల టాలీవుడ్‌కు పూర్తిగా డల్ సీజన్‌గా మారిపోయింది. మొత్తం 29 సినిమాలు విడుదలైనా అందులో అన్నీ వెరీ స్మాల్ బడ్జెట్ సినిమాలే ఉండటంతో, సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడంలో ఇండస్ట్రీ భారీగా విఫలమైంది. ‘గాయపడ్డ సింహం’లో తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నా, క్రైమ్ రివెంజ్ యాంగిల్ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదు. అలాగే ‘జెట్లీ’లో సత్య కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయినా వీక్ సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టలేకపోయింది. లావణ్య త్రిపాఠి కీ రోల్ చేసిన ‘సతీ లీలావతి’ ఆకట్టుకోలేకపోయింది. మే 29న వస్తున్నా కొన్ని చిన్న సినిమాలకి థియేటర్స్‌ని ఫుల్ చేసేంత సీన్ లేదు. మొత్తానికి సమ్మర్ లాంటి గోల్డెన్ సీజన్‌లో కూడా ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడం 2026 టాలీవుడ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారింది.
ఆశలు
సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు వరుస డిజాస్టర్లు చూసిన టాలీవుడ్‌కి ఫస్ట్ హాఫ్ ఎండ్‌లో భారీ పరీక్ష ఎదురవుతోంది. ‘పెద్ది’, ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’ లాంటి భారీ బడ్జెట్, ప్రయోగాత్మక సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్‌కు మళ్ళీ ఊపిరి పోస్తాయా? లేక భారీ హైప్ మధ్య మరొకసారి అంచనాలు తలకిందులు అవుతాయా? ఇప్పటికే వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న టాలీవుడ్‌కు ఈ సినిమాలు నిజంగానే కొత్త ఎనర్జీ ఇస్తాయా లేక మరోసారి భారీ అంచనాలే మిగిలిపోతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
