పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ బరిలో తన సత్తాను చాటాడు. అతని రెండో సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేశారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అదే పేరును పెట్టడం విశేషం. ఇందులో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్ గా కనిపించబోతున్నాడు. శుక్రవారం అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ ట్విట్ చేసింది.
Read Also : నానీకి నాన్ కోపరేషన్ తప్పదా!?
ఆమెతో పాటే చిత్ర దర్శకుడు క్రిష్… మరికొందరు సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ మోషన్ ను రిలీజ్ చేశారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీని, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ నవలా చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ సముద్రం నేపథ్యంలో తెరకెక్కగా, ఈ రెండో సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకోవడం విశేషం. మరి తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.