Tillu Cube Sequel to Tillu Square Announced by Siddhu Jonnalagadda: డీజే టిల్లు సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ పేరుతో ఒక సీక్వెల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో తీసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ మధ్యలో మీడియాతో మాట్లాడేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లోనే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన మూడవ పార్ట్ కూడా సినిమాగా చేయబోతున్నట్లు సినిమా నిర్మాత నాగ వంశీ, హీరో కం రైటర్ సిద్దు జొన్నలగడ్డ వెల్లడించారు. నిజానికి ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమాలో మూడవ భాగానికి అవకాశం ఉన్నట్లు చూపించారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూడో భాగాన్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
Vijay Deverakonda : ప్రేమ పెళ్లే చేసుకుంటా.. రష్మీక పేరు లాగుతూ విజయ్ కామెంట్స్
ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు తమకు ఒక ఐడియా ఇచ్చారని సినిమా చివరిలో సిద్దు జొన్నలగడ్డ నడుచుకుంటూ వెళ్లిపోతున్న సమయంలోనే మూడో భాగాన్ని అనౌన్స్ చేస్తామని సోమవారం నుంచి ఆ అనౌన్స్ చేసిన వీడియో కూడా సినిమాల్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చారు నాగ వంశీ. ఇక వేసవి సెలవులు కలిసి రావడంతో మొదటి రోజే పాతిక కోట్లు గ్రాస్ రావచ్చని భావిస్తున్నామని, పూర్తిస్థాయిలో సినిమా 100 కోట్లు ఈజీగా రాబడుతుందని అంచనాలు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికాలో కూడా బుకింగ్స్ బాగున్నాయని ప్రీమియర్ కలెక్షన్స్ కూడా అర మిలియన్ డాలర్లు మొదటి రోజే వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మల్లిక్ రాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు.