Tiger 3 Trailer to be launched soon: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టైగర్ 3 రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమయింది. ఇక దానికి సంబంధించిన మేకర్స్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్ ఇనుప గొలుసు పట్టుకుని శత్రువుల భరతం పట్టటానికి సిద్ధంగా కనపడుతుండగా ఈ పోస్టర్ ద్వారా ‘టైగర్ 3’ చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటూనే ప్రేక్షకులకు వావ్ అనిపించేలా ఉంటుందని హింట్ ఇచ్చేలా ఉంది. ఈ పోస్టర్ తో ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ క్యూరియాసిటీ పెరుగుతుంది. తిరుగులేని శక్తితో టైగర్ తన శత్రువులను వేటాడటానికి సిద్ధంగా ఉందని అది ట్రైలర్‌తో మరోసారి తెలియనుందని అంటున్నారు.
Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్.. అవకాశాన్ని వదులుకోవద్దు
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ టైగర్ 3 రానుంది, ఈ ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘టైగర్ 3 చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది, టైగర్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే అందులో హీరోని లార్జర్ దేన్ లైఫ్‌లా ఆవిష్కరిస్తారు. హీరో అందులో హీరో ఆయుధం లేకుండా శత్రువులను అంతం చేస్తాడు, తన శత్రువుల్లో చివరివాడు అంతమయ్యే వరకు టైగర్ అలాగే నిలబడి ఉంటాడని అన్నారు. తను సవాళ్లను స్వీకరిస్తాడు, దాన్ని పూర్తి చేయటంలో వెనకడుగు వేయడు, నిజ జీవితంలోనూ టైగర్ తన వేటను పూర్తి చేసే వరకు వెనకడుగే వేయడు ఇందులో నా పాత్ర టైగర్‌లా ఉంటుందని అన్నారు. హీరో పాత్ర పోరాటంలో వెనక్కి తగ్గకుండా ఉంటుందని, తను అస్సలు వెనక్కి తగ్గడు, దేశం కోసం చివరి వరకు నిలబడే వ్యక్తి తనే అవుతాడని అన్నారు.