మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రబుత్వంన్ గుడ్ న్యూస్ తెలిపింది.
తెలంగాణలో ‘ఆచార్య’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో టికెట్ పై మల్టీఫ్లెక్స్‌లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ‘ఆచార్య’ ఐదో ఆట ప్రదర్శనకు కూడా అనుమతి కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.