Samantha: బాలీవుడ్లో అవమానం.. ‘సెకండ్’ ముద్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! ఇదీ.. మన దక్షిణాది భామలపై బాలీవుడ్‌కి ఉన్న చిన్నచూపు! పచ్చిగా చెప్పాలంటే.. కూరలో కరివేపాకులా చూస్తారు. ఇప్పుడు సమంత విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అలాంటి వ్యవహార శైలే చూపిస్తున్నారని సమాచారం.
ద ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో సమంతకి వచ్చిన ప్రశంసలు, పాన్ ఇండియా క్రేజ్ చూసి.. ఇక ఈ అమ్మడు బాలీవుడ్లో రాజ్యమేలడం ఖాయమని అంతా అనుకున్నారు. అక్కడి స్టార్ భామల కంటి మీద కునుకు లేకుండా దూసుకెళ్తుందని భావించారు. కానీ, అందుకు భిన్నంగా సమంత ఇప్పటివరకూ ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కూడా ఓకే చేయలేదు. రోజులు, నెలలు గడుస్తున్నాయి.. బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల వార్తలూ వస్తున్నాయి.. కానీ స్పష్టత మాత్రం రావట్లేదు. ఎందుకు? సమంతకి ఆఫర్లు రావడం లేదా? లేక సమంతనే బ్యాక్‌స్టెప్ వేస్తుందా? అదే నిజమైతే, అందుకు కారణాలేంటి? అని ఇండస్ట్రీలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read
- RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నట్టుగా.. సమంత దక్షిణాదికి చెందిన నటి కావడంతో, కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే బాలీవుడ్ మేకర్స్ ఆఫర్ చేస్తున్నారట! పోనీ, వాటికి కనీసం ప్రాధాన్యత అయినా ఉందా అంటే, అదీ లేదని తెలిసింది. సౌత్‌లో తిరుగులేని స్టార్డమ్ కలిగిన తాను, మరీ ఇంత చీప్ రోల్స్ ఇవ్వడమేంటని అవమానంగా భావించి.. వాటిని ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఈ కారణం చేతనే సమంత బాలీవుడ్ అరంగేట్రం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. మరి, సమంత బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో, కాలమే సమాధానం చెప్పాలి.
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..