69వ నేషనల్ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో పది నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 2021 బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోని, ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ గా నటించి, అందరినీ మెప్పించిన అల్లు అర్జున్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంశలు అందుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు, సెలబ్రిటీల ట్వీట్స్ తో అల్లు అర్జున్ పేరు నేషన్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది, ఈ 20 ఏళ్లలో 69 ఏళ్ల తెలుగు సినిమా కోరికని తీర్చిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అందుకే అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డుని ప్రతి ఒక్కరూ తమకే వచ్చినట్లు, తమ ఇండస్ట్రీకే వచ్చినట్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డ్ రావడం ఓకే కానీ లాస్ట్ వరకూ ఈ అవార్డ్ విషయంలో అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చిన హీరో ఒకడున్నాడు. జై భీమ్ సినిమా నుంచి సూర్య, కర్ణన్ నుంచి ధనుష్, సార్పట్ట పరంబర్తె నుంచి ఆర్యలు అల్లు అర్జున్ కి పోటీగా నిలిచారేమో అనుకున్నారు కానీ కాదు. అల్లు అర్జున్ కి లాస్ట్ మినిట్ వరకూ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. సర్దార్ ఉద్ధం సింగ్ సినిమాతో విక్కీ కౌశల్ 2021లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. స్వాతంత్ర సమరయోధుడు ఉద్ధం సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫిజికల్ గా కూడా విక్కీ కౌశల్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అందుకే సూర్య, ధనుష్, ఆర్యలని దాటి అల్లు అర్జున్ కి పోటీగా విక్కీ కౌశల్ నిలిచాడు. చివరికి జ్యురీ అల్లు అర్జున్ వైపే మొగ్గు చూపడంతో నేషనల్ అవార్డ్ వచ్చేసింది.