ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప : ది రైజ్ 1” డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈరోజు సాయంత్రం మొదలైన ఈ వేడుకకు భారీ ఎత్తున బన్నీ అభిమానులు తరలివచ్చారు. ఇక ఈ వేడుకలోనే ఓ బుడ్డోడు ‘శ్రీవల్లి’ సాంగ్ ను పాడి అందరినీ ఫిదా చేసేశాడు. ఈ చిన్న పిల్లోడు కూడా ‘పుష్ప’లో ఓ పాత్రను చేశాడట. అక్కడే శ్రీవల్లిని చూసి ఫిదా అయిపోయి ఉంటాడు. అందుకే ‘శ్రీవల్లి’ సాంగ్ ను అంత బాగా నేర్చేసుకున్నాడు. ఈ అబ్బాయి క్యూట్ గా సాంగ్ పాడిన తీరుకు బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Read Also : “పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్